News

Realestate News

అంబికాబాగ్‌ ఆలయ అభివృద్ధికి చేయూతనివ్వాలి

అంబికాబాగ్‌ ఆలయ అభివృద్ధికి చేయూతనివ్వాలి
రాజగోపురం శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి మాణిక్యాలరావు పిలుపు
వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: నగరంలోని కనకమహాలక్ష్మి అమ్మవారి దత్తత ఆలయమైన అంబికాబాగ్‌ రామాలయాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని, దీనికిదాతలు విరాళాలు ఇచ్చేందుకు ముందుకు రావాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు పిలుపునిచ్చారు. అంబికాబాగ్‌ రామాలయ పరిధిలోని రూ. 1.20 కోట్ల ఖర్చుతో ప్రతిపాదించిన రాజగోపుర నిర్మాణానికి ఆదివారం ఉదయం మంత్రి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ రాజగోపుర నిర్మాణ ఖర్చును సంపత్‌ వినాయగర్‌ ఆలయ నిధుల నుంచి ఇవ్వడానికి ముందుకు వచ్చిన ఆలయ వ్యవస్థాపక ట్రస్టీ రాజేశ్వరన్‌ను అభినందించారు. రామాలయ నిర్మాణం కోసం సర్వశ్రేయోనిధి (సీజీఎస్‌) నుంచి రూ. 1.60 కోట్లు, కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం నుంచి రూ. 1.80 కోట్లు, విరాళాలు, హుండీల ద్వారా వచ్చిన ఆదాయం రూ. 38 లక్షలను ఇంతవరకూ ఖర్చు చేశామన్నారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలను చేపడతామని, దీనికి నగర ప్రముఖులు, దాతలు చేయూతనివ్వాలన్నారు. మంత్రి పర్యటన నేపథ్యంలో వేదపండితులు విశేష పూజాదికాలు నిర్వహించారు. దక్షిణ శాసనసభ్యులు వాసుపల్లిగణేష్‌కుమార్‌, ఎంపీ కె.హరిబాబు, ఎమ్మెల్సీ పి.వి.ఎన్‌.మాధవ్‌, సంపత్‌ వినాయగర్‌ ఆలయ ట్రస్టీ టి.ఎస్‌.రాజేశ్వరన్‌ దంపతులతో పాటు ఈవో ఎస్‌.జె.మాధవి, దేవాదాయ శాఖ ప్రాంతీయ సంయుక్త కమిషనర్‌ కె.రామచంద్రమోహన్‌, ఉప కమిషనర్‌ఎన్‌.వి.ఎస్‌.ఎన్‌.మూర్తి, ఆలయ ట్రస్టీలు చంద్రరావు, చలపతిరావు, దుర్గాప్రసాద్‌, శివయ్య, విజయకుమార్‌, దేవస్థానం డీఈఈ సిహెచ్‌.వి.రమణ, ఏఈఓలు వి.రాంబాబు, పి.రామారావు, సూర్యకుమార్‌, పర్యవేక్షకులు రాజు పాల్గొన్నారు. ఆలయ అధికారులు మంత్రి, ఇతర ప్రజాప్రతినిధులకు సాదర స్వాగతం పలికారు.

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo