అందుబాటులోకి మరో సౌకర్యం
ఆదర్శ పాఠశాలల వసతిగృహాల ప్రారంభానికి చర్యలు

తొమ్మిదోతరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు: జూన్లో ప్రారంభం కానున్న ఈ వసతిగృహాల్లో 9,10,వ తరగతులతోపాటు ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తారు. ఒక్కో వసతి గృహంలో 100 సీట్లు భర్తీ చేస్తారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 10 పాఠశాలల్లో ప్రవేశాలుంటాయి. మొత్తం 1000 మంది చేరేందుకు అవకాశం ఉంది. దూరప్రాంతాల వారికి ప్రాధాన్యం ఉంటుంది.
మహిళలకే ఉద్యోగ అవకాశాలు:
వసతిగృహాల్లో సిబ్బంది (మహిళలు మాత్రమే) నియామకానికి చర్యలు చేపట్టారు. ఇప్పటికే జిల్లాలో పొరుగుసేవల సంస్థకు వసతిగృహాల నిర్వహణ బాధ్యతలు అప్పగించనున్నారు. ఆసక్తి గలవారి నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నారు. ఒక్కో పాఠశాలకు వసతిగృహ సంక్షేమాధికారిణి, మ్యాట్రిన్స్, చౌకీదారు, ప్రధాన వంట మనిషి, సహాక వంటమనుషులను నియమించనున్నారు. సంక్షేమాధికారి పోస్టుకు డిగ్రీ, బీఎడ్ పూర్తి చేసి ఉండాలి. మిగిలిన నియామకాలకు 45 ఏళ్ల నుంచి 50 ఏళ్ల మథ్య వయసు కలిగి ఉండి చదవడం, రాయడం వచ్చి ఉండాలి. వంట పనివారలకు కనీస అక్షరాస్యత ఉండి 5 లేక 6 ఏళ్ల మేర వంట ఏజెన్సీల్లో పని చేసి ఉండాలి. 25-55 ఏళ్ల వయసులోపు వారికే దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు.
జూన్ నెలలో వసతిగృహాలు ప్రారంభం:
జిల్లాలోని 10 వసతిగృహాలను జూన్లో ప్రారంభి´ంచడానికి చర్యలు తీసుకుంటున్నాం. ఒక్కో వసతిగృహంలో 100 మందిని చేర్చుకుంటాం. ఇందుకు పొరుగుసేవల సంస్థ ఎంపిక చేయాల్సి ఉంది. అన్నీ పూర్తి చేసి కలెక్టర్కు నివేదికలు పంపిస్తాం. సిబ్బందికి పొరుగుసేవల సంస్థ(అవుట్సోర్సు సంసే)్థ గౌరవ వేతనాలు అందజేస్తాయి.