అందరి బాధ్యతగా పరిసరాల శుభ్రత
అందరి బాధ్యతగా పరిసరాల శుభ్రత
స్వచ్ఛభారత్ ర్యాలీలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.ఎన్.రావు
అరకులోయ పట్టణం, న్యూస్టుడే: పరిసరాల పరిశుభ్రతను ప్రతి ఒక్కరూ బాధ్యతగా గుర్తించాలని రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కారాల కమిషనర్, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీఎన్ రావు నళ్లా అన్నారు. వినియోగదారుల సంఘం, విశాఖ యూత్ వినియోగదారుల క్రమశిక్షణ సంఘం ఆధ్వర్యంలో అరకులోయలో బుధవారం స్వచ్ఛభారత్ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన జస్టిస్ బి.ఎన్.రావు తొలుత స్వచ్ఛభారత్ ర్యాలీని ప్రారంభించారు. చెత్తను బుట్టల్లోనే వేసేలా అవగాహన కల్పించే ప్రయత్నంలో భాగంగా పట్టణంలోని పలువురు వ్యాపారులకు చెత్త బుట్టలను పంపిణీ చేశారు. ప్రకృతిపైనే జీవ మనుగడ ఆధారపడి ఉందన్నారు. ప్రకృతి సంరక్షణలో పర్యావరణం, పరిసరాల పరిశుభ్రత ముడిపడి ఉందని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఆ దిశగా అడుగులు వేయాల్సిన అవసరముందన్నారు. తహసీల్దారు నాగభూషణరావు, సీఐ వెంకినాయుడు, వినియోగదారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మర్రి సత్యనారాయణ, విశాఖ యూత్ వినియోగదారుల క్రమశిక్షణ సంఘం కన్సూ్యమర్స్ జిల్లా ఉపాధ్యక్షుడు ఆచారి, కార్యదర్శి రాజు, స్థానిక వ్యాపారులు పాల్గొన్నారు.
Notice: compact(): Undefined variable: limits in
/home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line
821
Notice: compact(): Undefined variable: groupby in
/home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line
821
Warning: count(): Parameter must be an array or an object that implements Countable in
/home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line
399