News

Realestate News

అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి

అందంగా… ఆహ్లాదంగా ఐటీ లేఅవుట్‌
అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి
ఈనాడు – విశాఖపట్నం: కాపులుప్పాడలో ఐటీ లేఅవుట్‌ శరవేగంగా సన్నద్ధమవుతోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో అక్టోబరులోగా ఆవిష్కరించనున్నారు. తద్వారా ఆ రంగం ఎదుర్కొంటున్న స్థల సమస్యను అధిగమించనున్నారు. అనేక సంస్థలు విశాఖలో ఐటీ సేవల ప్రారంభానికి సిద్ధంగా ఉన్నా.. తగిన చోటు లేక ఇబ్బందులు ఎదురవుతున్న సంగతి తెలిసిందే. అవి సమగ్ర వసతులున్నరెడీమేడ్‌ ప్రాంగణాలనే కోరుకుంటున్నాయి. ఇందుకోసమే ప్రభుత్వం మిలీనియం టవర్‌ నిర్మాణం చేపట్టింది. ఇందులోని మొత్తం స్థలాన్ని కాండ్యుయంట్‌ సంస్థ కోరింది. అంతర్జాతీయంగా సుప్రసిద్ధ సంస్థ కావడంతో ప్రభుత్వం అంగీకరించింది. ఈ నేపథ్యంలో నగరంలో మిగిలిన ఐ.టి. సంస్థల కోసం కాపులుప్పాడ ఐ.టి.లేఅవుట్‌ను అభివృద్ధి చేస్తోంది.

ఈ లేఅవుట్‌ నుంచి సాగరతీరం (సీవ్యూ), లోయలు (వ్యాలీ వ్యూ) కనిపించేలా సముద్ర మట్టానికి 140 మీటర్ల ఎత్తులో కొండ పైభాగంలో అభివృద్ధి చేస్తున్నారు.
8.86 ఎకరాలను పార్కింగ్‌కు కేటాయిస్తున్నారు.

కొండ దిగువ నుంచి పైభాగం వరకు వంద అడుగుల వెడల్పుతో నాలుగు వరుసల రహదారి నిర్మిస్తున్నారు. ః కొండ పైభాగంలో విశాలమైన రహదారుల వ్యవస్థను అందుబాటులోకి తెస్తున్నారు. సుమారు ఏడు కిలోమీటర్ల పొడవున అంతర్గత రహదారులు నిర్మిస్తున్నారు. 39.97 ఎకరాల విస్తీర్ణంలో మొత్తం రహదారులే.

ఉద్యోగులు సేదదీరడానికి వీలుగా 30.41 ఎకరాల బహిరంగ స్థలంలో ఉద్యానవనాలు, ఆహ్లాదకర ప్రాంతాలను అభివృద్ధి చేస్తారు.

ఐటీ సంస్థలకు వివిధ సేవలందించేవాటికి 90 ఎకరాలు అందుబాటులో ఉంటుంది.
ఉమ్మడి అవసరాల కోసం 5.31 ఎకరాలను కేటాయించారు.

కొండపైకి వెళ్లే మార్గం సురక్షితంగా ఉండేలా రక్షణ గోడలను నిర్మిస్తున్నారు.
కొండ దిగువ నుంచి పై వరకు రూ. 20 కోట్ల వ్యయంతో మంచినీటి పైపులైను వ్యవస్థలను, పంప్‌హౌస్‌ను నిర్మిస్తున్నారు.

ఐటీకి ప్రధాన ఆకర్షణగా…. : నగరంలో ఐటీ రంగానికి ప్రస్తుతం హిల్‌-1, 2, 3 అందుబాటులో ఉన్నా.. ఎక్కడా స్థలాలు ఖాళీగా లేవు. అందుకే కాపులుప్పాడ ఐ.టి. లేఅవుట్‌ను రూ. 24 కోట్లతో అభివృద్ధి చేస్తున్నాం. దశలవారీగా 1360 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్‌ ఐ.టి.టౌన్‌సిప్‌ ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ నిర్ణయం. ప్రస్తుతానికి 175.91 ఎకరాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసి అక్టోబరుకల్లా అందుబాటులోకి తెస్తాం.

– యతిరాజు, జోనల్‌ మేనేజర్‌, ఎ.పి.ఐ.ఐ.సి.

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo